అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాటస్ఫూర్తితో శ్రామిక మహిళా హక్కుల కోసం ఉద్యమిద్దాం..సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పద్మ శ్రీ 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక  మార్చ్ 8. (ఫైసల్ ఖాన్)
జగిత్యాలలో ఆశా వర్కర్ పై అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి బాధితురాలికి సత్వర న్యాయం చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్…

ఈరోజు నిజామాబాద్ జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రామిక మహిళ ప్రదర్శన జిల్లా పరిషత్ కార్యాలయం నుండి సిఐటియు కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది అనంతరం సదస్సులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పద్మ శ్రీ మాట్లాడుతూ తమపై జరుగుతున్న దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పని గంటల తగ్గింపుకు, పని పరిస్థితుల మెరుగుకై, వేతనాల పెంపుకై, ఓటు హక్కుకై సుదీర్ఘ పోరాటల ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి 115 ఏండ్ల చరిత్ర ఉందని, అంతకన్నా ఎక్కువ చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా మహిళల పోరాటాలకు ఉందన్నారు. తరతరాల నుండి మన సమాజంలో ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో వేళ్ళూలుకొని ఉండటంమూలాన మహిళలు అవమానాలకు, హింసకు, దాడులకు గురౌతూనే ఉన్నారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతిని సాధించామని అభివృద్ధి వైపుకు దూసుకుపోతున్నామని మన పాలకులు చెప్పుకుంటున్నప్పటికీ ఆడ పిల్లలపై, మహిళలపై అత్యాచారాలు, హింసాత్మక దాడులు, ప్రేమోన్మాద హత్యలు పెరుగుతున్నాయని, ఉన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ జగిత్యాలలో ఆశా వర్కర్ పై అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి బాధితురాలికి సత్వర న్యాయం చేయాలి* జగిత్యాల జిల్లాలో దళిత ఆశా కార్యకర్త మీద పిబ్రవరి 27వ తేదీన శివరాత్రి పండుగ డ్యూటీ చేసి ఇంటికి తిరిగి వెలుతున్న సందర్భంలో జరిగిన అత్యాచారం, దాడిని సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటిగా తీవ్రంగా ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిందితున్ని వెంటనే SC/ST చట్టంలోని సెక్షన్స్ ప్రకారం కఠినంగా శిక్షించాలని, బాధిత ఆశా వర్కర్ కు మరియు ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో జరిగిన ఈ సంఘటన అత్యంత బాధాకరమని సిగ్గుచేటనిఅన్నారు. ఈ నేరానికి పాల్పడిన నిందుతిన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. ఈ అత్యాచార సంఘటనలు దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. బేటీ బచావో బేటీ పఢావో లాంటి పథకాల ద్వారా మహిళలను ప్రసన్నం చేసుకోజూస్తు ఇప్పటికైనా ఆశా వర్కర్ కుటుంబానికి ఆదుకోకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, సిఐటియు జిల్లా కోశాధికారి స్వర్ణ ఆశ యూనియన్ జిల్లా నాయకులు రేణుక సుకన్య రేణుక స్వప్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు విజయ అంగన్వాడి యూనియన్ నాయకులు సునీత సందీప్ సుమలత గిరిజ ఇంద్ర భూలక్ష్మి శోభ సిహెచ్ నర్స్ దివ్య తదితరులు పాల్గొన్నారు. 

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!