నిజామాబాద్ RTC బస్టాండ్‌లో బస్ పాస్ కౌంటర్ మార్పు… నోటీసు లేక ప్రయాణికులకు ఇబ్బందులు.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 08 : (షేఖ్ గౌస్) నిజామాబాద్ RTC బస్టాండ్‌లో బస్ పాస్‌లు ఇచ్చే కౌంటర్ స్థానాన్ని అధికారులు ఇటీవల మార్చారు. అయితే ఈ మార్పు విషయమై బస్టాండ్‌లో ఎలాంటి నోటీసు లేదా సూచన బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బస్ పాస్‌ల కోసం వచ్చే విద్యార్థులు, జర్నలిస్టులు, రోగులు ఎప్పటిలాగే పాత కౌంటర్ వద్దకు చేరుకుని, అక్కడ పాస్‌లు ఇవ్వడం లేదని తెలిసి నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.ప్రస్తుతం బస్ పాస్‌లు హైదరాబాద్ వైపు వెళ్లే బస్సుల స్టాప్ వద్ద ఇస్తున్నప్పటికీ, సరైన సమాచారం లేక ప్రజలు ఒక చోట నుంచి మరో చోటికి తిరుగుతూ సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు వెంటనే స్పందించి, బస్టాండ్‌లో స్పష్టమైన నోటీసు బోర్డులు ఏర్పాటు చేసి, పాస్ కౌంటర్ మార్పు విషయాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment