నగరం లో గంజాయి బ్యాచ్ వీరంగం

జై భారత్ దినపత్రిక నిజామాబాద్  జనవరి 03 : జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది.. గంజాయ్ అమ్మకాలపై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నీవే అని ఆటో డ్రైవర్ ఇంటిపై దాడి చేసి చేశారు. ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆటోను ధ్వంసం చేశారు. నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ పరిధిలో గల పంబౌడీ లో యాసిన్ అనే ఆటో డ్రైవర్ ఇంటిపై కొందరు యువకులు దాడి చేసి ధ్వంసం చేశారు. శుక్రవారం రాత్రి సంబంధిత బ్యాచ్ హల్చల్ చేసింది. ఇటీవల కాలంలో స్థానిక పోలీసులు గంజాయి సేవిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకొని విక్రేతల గురించి ఆరా తీశారు. యాసీన్ ద్వారానే తాము గంజాయి విక్రయిస్తున్న విషయం పోలీసులకు తెలిసిందని గత నెల 31న రాత్రి కొందరు యువకులు యాసిన్ ను చితకబాదారు. అంతటితో ఊరుకోకుండా శుక్రవారం రాత్రి యాసిన్ ఇంటిపై దాడి చేసి బెదిరింపులకు దిగారు. శనివారం ఉదయం యాసిన్ తల్లి ఆశాబేగం స్థానిక మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment