నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8.(షేక్ గౌస్)
బిహార్ రాష్ట్రంలోని గయా మహాబోధి దేవాలయాన్ని బౌద్ధుల స్థానంలో బ్రాహ్మణులు నిర్వహిస్తున్నారనే కారణంగా బౌద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నిజామాబాద్ ఫులాంగ్ అంబేద్కర్ చౌక్ వద్ద బౌద్ధ సంఘాల నేతలు నిరసన తెలిపారు.రాష్ట్ర ఇన్‌చార్జి చెన్నయ్య మాట్లాడుతూ, “బౌద్ధ ప్రార్థనా కేంద్రాన్ని బౌద్ధులే నిర్వహించాలి. మరొక మతానికి చెందిన వ్యక్తులు ఆలయాన్ని నిర్వహించడం అర్థరహితం. ఇది బౌద్ధ సంప్రదాయాలను దెబ్బతీసే చర్య” అని మండి పడ్డారు.మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) నేత షేక్ హుస్సేన్ మాట్లాడుతూ, “బౌద్ధుల పవిత్ర ఆలయాలపై బౌద్దులకే హక్కులు ఉండాలి. గయా బౌద్ధ ప్రార్థనా కేంద్రాన్ని బౌద్ధుల ఆధ్వర్యంలోనే నిర్వహించాలనే మా డిమాండ్” అని తెలిపారు.నిరసనలో పాల్గొన్న ఇతర నాయకులు బౌద్ధ సంప్రదాయాలను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని బౌద్ధ సంస్థలు కూడా ఈ విషయంలో స్పందించాలని, ఆలయ నిర్వహణ హక్కులను బౌద్ధులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.