పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో ఆర్మూర్ పట్టణంలో రక్తదాన శిబిరం

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఇట్టి కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరై మాట్లాడుతూ పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందువరసలో ఉంటారని ముఖ్యంగా రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో, ప్రమాద పరిస్థితుల్లో ఉన్నవారికి, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలవుతుందని, రక్తదానం ఒక మహత్తరమైన సేవ, ఇది మనిషి ప్రాణాలను కాపాడే పవిత్రమైన కార్యం అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్మూర్ కు చెందిన యువకులు సిపి సాయి చైతన్య కు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది, పట్టణ యువకులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment