నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-7
రాష్ట్ర బీజేపీ కార్యాలయం లో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది ఈ సందర్బంగా ఎమ్మెల్సీలు చిన్నమలై అంజి రెడ్డి, మల్క కొమురయ్య ని సన్మానించాను. ఈ సందర్భంగా దినేష్ పటేల్ మాట్లాడుతూ ఈ విజయం బీజేపీ కార్యకర్తల కృషి ఫలితం. గెలిచిన ఎమ్మెల్సీలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతను గుర్తుంచుకొని, పార్టీ సిద్ధాంతాలకు నిబద్ధంగా సేవ చేయాలి. రాష్ట్రంలో బీజేపీని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు చొరవ తీసుకోవాలి. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మనందరం ముందుకు సాగాలి అని పేర్కొన్నాను. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ , ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ పాల్గొని ఎమ్మెల్సీలను అభినందించారు.