నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కొరకు ఒక్కరూపాయి కూడా కేటాయించకుండా ఇందూరు జిల్లా ప్రజలను బడ్జెట్ లో మరొకసారి మొండి చేయి చూయించిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ద్వజమెత్తారు. ఇన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న జక్రన్ పల్లి ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి కూడా ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రకటన లేకపోవడం సిగ్గుచేటనీ ఎద్దేవ చేశారు.తెలంగాణ యూనివర్సిటీ రోజురోజుకు అనేక సమస్యల అభివృద్ధి కోసం నిరాశ కలిగించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని ఎన్నికల సందర్భంగా హామీనిచ్చారు, బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదనీ తెలిపారు.బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల గురించి ప్రస్తావనే లేకపోవడం గల్ఫ్ కార్మికులను మోసం చేసినట్లేనని దుయ్యబట్టారు. ఎన్నికలో ప్రజలను మభ్యపెట్టి కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నమ్మించి మర్కొకసారి మోసం చేశారని మండిపడ్డారు.