నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12.
బాల్కొండ మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ముగింపు సందర్భంగా గత మూడు రోజుల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న బాల్కొండ మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ముగింపు పలకడం జరిగింది ఇట్టి క్రీడలలో సుమారు 30 జట్లు పాల్గొన్నాయి, క్రీడాకారులకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలను , యోగ ,అథ్లెటిక్స్ తదితర అంశాలలో తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించ జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగింది క్రీడల్లో చివరి దినం రోజున మహతి, తెలంగాణ మోడల్ స్కూల్, సెయింట్ ఏ ఎస్ పాఠశాలల విద్యార్థులు యోగా లో అత్యంత ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు.మండల స్థాయి క్రీడా పోటీలు ముగింపు సందర్భంగా సందర్భంగా తెలంగాణ కోఆపరేటివ్ చైర్మన్ మానాల రెడ్డి మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు క్రీడల్లో రాణించి గ్రామీణ స్థాయి నుంచి ఒలంపిక్స్ ఒలంపిక్స్ స్థాయికి స్థాయికి ఎదిగి ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్షను నెరవేర్చాలి అన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో విద్యా వైద్య రంగాలలో ముందుకు దూసుకెళ్తుందని అంతే క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు, గత ప్రభుత్వాలు చేయని విధంగా విద్యారంగానికి ఎంతో సేన ఎనలేని సేవలు అందించడం జరిగింది అన్నారు, ముఖ్యమంత్రి గారికి విద్యార్థుల పట్ల ఉన్నటువంటి నిబద్ధతే మరియు తెలంగాణ రాష్ట్రాన్ని విద్యారంగంలో అగ్రగామిగా నిలపడానికి ఇటీవల మెగాడీఎస్ ని నిర్వహించడం జరిగిందన్నారు, డీఎస్సీని నిర్వహించడమే కాకుండా సకాలంలో వారికి ఉత్తర్వులు ఇచ్చి ఉపాధ్యాయులకు ఆర్డర్స్ ఇచ్చి విదులలో చేరే విధంగా చేశారన్నారు చరిత్రలో ఎన్నటి లేని విధంగా అన్ని గురుకులాల విద్యార్థుల యొక్క డైట్ చార్జీలను 40 శాతం పెంచడం జరిగిందన్నారు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు నిర్వహించారు , పాఠశాల స్థాయిలో పా పారిశుద్ధ్య నిర్వహణ కొరకు స్కావెంజర్లు నియమించారన్నారు , అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాల యొక్క విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుందన్నారు, దీనికి ప్రతిఫలంగా విద్యార్థిని విద్యార్థులు విద్యారంగంలో తెలంగాణని అగ్రగామిగా నిలవాలని అంతే కాకుండా విద్యార్థులు క్రీడల్లో రాణించి ఒలంపిక్ స్థాయికి ఎదగాలని ఆయనఆకాంక్షించారు , అనంతరం విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎంపీడీవో. విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, క్రీడల ఆర్గనైజర్ రాజ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ , మాజీ సర్పంచ్ తౌట్ గంగాధర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.