నందిపేట మండలం లో బక్రీద్ ఉత్సాహం

భక్తి శ్రదాలతో ఈద్గాహ్‌లలో నమాజ్‌ ఆచరించిన ముస్లిం సోదరులు.

నందిపేట జై భారత్ జూన్ 7: (షేక్ గౌస్) త్యాగానికి ప్రతీకగా పరిగణించే ఈద్ ఉల్ అజ్హా (బక్రీద్) పండుగను నందిపేట మండలంలోని పలు గ్రామాల్లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుఝామున నుంచే ఈద్గాహ్‌ల వద్ద ప్రత్యేక నమాజులు నిర్వహించడంతో పండుగ నూతనోత్సాహం కనిపించింది.హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను అల్లాహ్ కొరకు బలి చేయడానికి సిద్ధపడిన త్యాగాన్ని ముస్లింలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మేకలు, గొర్రెలను బలిచేసి, మాంసాన్ని పేదలకు, బంధువులకు పంచారు. కుటుంబసభ్యులతో విందులు నిర్వహించారు.నందిపేట, ఖుదా నూర్‌పూర్, వన్నెల్, దొంకేశ్వర్, నూత్పల్లి, తొండకూర్, అయిలాపూర్, మల్లారం తల్వేద తదితర గ్రామాల్లో పండుగ ఉత్సాహంగా జరగింది.ఈ సందర్భంగా మంద మహిపాల్, సిలిండర్ లింగం, మండల ముస్లిం కమిటీ అధ్యక్షుడు జావేద్ (కుదాన్పూర్), ఫౌండర్ షేక్ గౌస్, నందిపేట్ కమిటీ అధ్యక్షుడు షౌకతుల్ బారీ, మాజీ కో ఆప్షన్ సభ్యులు మజారుద్దీన్, సయ్యద్ హుస్సేన్, మాజీ అధ్యక్షులు అహ్మద్ ఖాన్, కలిం, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ నాయకుడు ఫారూఖ్ ఖాన్, టీఆర్ఎస్ మైనారిటీ సెల్ పాషా, కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఇసుబ్ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈద్గాహ్‌ల వద్ద ఎస్‌ఐ చిరంజీవి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!