ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఆదేశానుసారముగా ప్రపంచ లైంగిక దుర్వినియోగం, వేధింపులు మరియు హింస నివారణ అండ్ కోలుకొనడం దినోత్సవం సందర్భంగా భరోసా సెంటర్ ధర్మారం రెసిడెన్షియల్ స్కూల్ బాలికలకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమానికి అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వరెడ్డి హాజరై , బాలికలను లక్ష్యాలపై దృష్టి పెట్టి విజయవంతంగా ఎదగాలని ప్రోత్సహించారు. ఎలాంటి సమస్య వచ్చినా భయపడి కాకుండా పోలీసులను సంప్రదించాల్సిన అవసరాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై పుష్పావతి, కోఆర్డినేటర్ రోజా, లీగల్ సపోర్ట్ పర్సన్ డయానా, సపోర్ట్ పర్సన్ మౌనిక, షీ టీమ్స్ ఎస్సై శ్రావంతి మరియు ఇతరులు పాల్గొన్నారు. భరోసా సేవలు మరియు దినోత్సవ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు.
ధర్మారం రెసిడెన్షియల్ స్కూల్‌లో భరోసా అవగాహనా కార్యక్రమం
Published On: November 19, 2025 9:07 pm









