నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9.
ఘరానా నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్, ఎల్.రాజా వెంకట్ రెడ్డి
ఏసీబీ ఎల్ రాజా వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నిందితులు సుమారు నాలుగు రోజుల క్రితము నవిపేట్ లోని గంగా వైన్ షాప్ ముందు పార్కింగ్ చేసి ఉన్నటువంటి హీరో HF Deluxe మోటార్ సైకిల్ ను దొంగతనం చేశాడు, ఇదే కాకుండా నవీపేట్ లో ఇంకా 05 బైక్ లు , రెంజల్ లో 01, బోధన్ టౌన్ లో 01 మరియు బాసర లో 01 పలు దొంగతనలు చేసినాడు. అంతే కాకుండా ఏ2 అయిన సయ్యద్ సోహెల్ తో కలిసి నవీపేట్ లో ఇంకో బైక్ దొంగతనం చేసి, ఈ బైక్ లు అన్నీ ఏ1 ఇంటి వెనుకల రహస్యంగా దాచిపెట్టి , వీటన్నిటిని ఇద్దరు కలిసి మహారాష్ర్ట లో మరి కొన్ని దొంగతనాలు చేసాకా అన్నీ కల్పి అమ్ముకుందామని నిర్ణయించుకునారు.అందులో బాగంగా ఈ రోజు నవీపేట్ లో మేకల అంగడి ఉందని,మళ్ళీ ఇద్దరు కలిసి కొన్ని బండ్లు దొంగలించలని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అంతే కాకుండా ఏ2 సయ్యద్ సోహెల్ మహారాష్ట్ర లోని,ఉమ్రి,ధర్మబాద్ మరియు బొకార్ ల లో కూడా దొంగతనలు చేశాడనీ ఏ సి పీ తెలిపారు.ఈ కేసు చేధనకు నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్, ఎల్.రాజా వెంకట్ రెడ్డి అధ్వర్యంలో బి.శ్రీనివాస్ నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆర్. లక్ష్మయ్య ఇంచార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ పిఎస్ నవీపేట్ , రాజశేకర్ సబ్ ఇన్స్పెక్టర్ పిఎస్ మాక్లూర్, గంగాధర్ సబ్ ఇన్స్పెక్టర్ పిఎస్ టౌన్-V మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది కేసును వివిధ కోణాలలో పరిశోధించి జరిగిన అంతరాష్ట్ర కేసులలో నిందితులు గా ఉన్న తహసీన్ ఖాన్ మరియు సయ్యద్ సోహెల్ ల ను పట్టుకున్న పై పోలీసు ఆఫీసర్ మరియు సిబ్బంది అందరిని అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్, అబినందిచరు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆర్. లక్ష్మయ్య, ఇంచార్జ్ ఎస్‌ఐ పిఎస్ నవీపేట్. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు