నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 23.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కొండూర్ శివారులో గల గుత్పా ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మోటార్ బటన్ నొక్కి నీటిని విడుదల చేశారు.గుత్పా ప్రాజెక్టు ద్వారా నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్ మండలాల్లోని వేల ఎకరాల భూములకు సాగునీటి లబ్ధి కలగనుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, “నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలి అని పేర్కొన్నారు.