నిజామాబాద్ జై భారత్ జూన్ 26 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS. మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా నిజామాబాదు విద్యార్థిని విద్యార్థులకు, ప్రజలకు యువకులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం కష్టపడే వారు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాలని , యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరము డ్రగ్స్ కు దూరంగాఉందాం బంగారు తెలంగాణ సాకారం చేసుకుందాం అని తెలియజేశారు.
పోలీస్ కమిషనర్ పచ్చ జెండాతో ప్రారంభించిన ర్యాలీని పాత కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమై జిల్లా ఫైర్ స్టేషన్ , రాష్ట్రపతి రోడ్డు , ఖలీల్ వాడి, రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ IAS కరోలినా ఛాంగ్ ఎన్.మావీ, నిజామాబాదు అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) బస్వా రెడ్డి, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి రసూల్ బి, ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, నిజామాబాదు ACP రాజా వెంకట్ రెడ్డి, మరియు విద్యార్థులు, NCC సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.