నేడు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు ఏఐటియుసి105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య ప్రారంభించడం జరిగింది నేడు, రేపు ఈ వేడుకలు ఏఐటియుసి అనుబంధరంగాల కార్యాలయాల ముందు నాయకులు జెండాలు ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ జరపాలని ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులను కోరారు నేడు ఆస్పత్రి ఎంప్లాయిస్ యూనియన్, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వర్కర్స్ యూనియన్, రిటైల్ కూరగాయల అమ్మకం దారులు, రైస్ మిల్ ఆపరేటర్ల యూనియన్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీ యూనియన్ కార్యాలయాల వద్ద AITUC జెండాలను వై.ఓమయ్య, మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఏఐటియుసి జెండాను పి.సుధాకర్ ఆవిష్కరించడం జరిగింది .ఈ సందర్భంగా వై.ఓమయ్య మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న ఏఐటియుసి ఆవిర్భావం జరిగిందని ఆనాడు భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాటం నిర్వహించిన ఏకైక కార్మిక సంఘం ఏఐటియుసి అని, బ్రిటిష్ కాలంలోనే కార్మికులకు పిఎఫ్, గ్రాడ్యుటి చట్టాలను తీసుకువచ్చిందని నాటి నుండి నేటి వరకు కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నామని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గత పాలనలో కార్మికులు పోరాడి సాగించుకున్న 29 చట్టాలను రద్దుచేసి 4 కోడ్ లుగా మార్చడం కార్మికుల హక్కులను కాలరాయడమేనని అన్నారు ఇప్పటికైనా కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు రాష్ట్రంలో ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పి నర్సింగరావు జిల్లా ఉపాధ్యక్షులు టి చక్రపాణి, పి హనుమన్లు, జిల్లా నాయకులు రాధా కుమార్, భానుచందర్, ప్రసాద్, పరశురా ం, అనిల్, సాయిలు ఏఐటీయూసీ అనుబంధ రంగాల యూనియన్ కార్యాలయాల వద్ద జరిగిన జెండా ఆవిష్కరణలలో సంబంధిత యూనియన్ నాయకులు పాల్గొనడం జరిగింది
ప్రారంభమైన ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Updated On: November 2, 2024 7:10 pm
