నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 11
శుక్రవారం నమాజు తర్వాత ప్రతి ఒక్క మసీదులలో వక్ఫ్ బోర్డు నిరాసన వ్యక్తం చేయాలని. ముస్లిం పర్సనల్ లా కమిటీ తరపున పిలుపునిచ్చారు . నిజామాబాద్ నగరంలో ముస్లిం పర్సనల్ లా కమిటీ ఆధ్వర్యంలో ఖురేషి మజీద్ నందు పెద్ద ఎత్తున నిరాసన తెలుపుతూ.
ఖజి బాబార్ , ఇమామ్ అన్వర్ ఉల్లా ఖాద్రి మాట్లాడుతూ
మోడీ గవర్నమెంట్ ఎప్పుడు హిందూ ముస్లింల పట్ల చిచ్చు పెట్టడానికి తప్ప వేరే ఆలోచనలు ఉండయని ఏదో ఒక విధంగా ముస్లిం మైనారిటీ లా లో బలత్కారంగా చూరబడి ఇలాంటి బిల్లులు అమలు చేస్తారని తెలిపారు. వక్ఫ్ బోర్డు బిల్లును త్వరగా తిరిగి వాపస్ తీసుకోవాలని హెచ్చరించారు. అనవసరంగా కబ్జాలు చేసిన భూములను వదిలి వెళ్ళి పోవాలని తెలిపారు వక్ఫ్ భూములు మజీద్ లకు ,మదర్సాలకు ,స్మశానవాటికలకు చెందినవి . త్వరగా ఈ బిల్లును తిరిగి తీసుకోకపోతే వచ్చే రోజుల్లో చెడు అనుభవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మసీద్ సదర్ నుస్రత్, ఫయాజ్ ఉద్దీన్, తమిజ్ ఊద్దిన్, తాహిర్, షాదాబ్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.