సమన్యాయం కోసమే సమగ్ర సర్వే, ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తో రాష్ట్రంలోని ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలో జరుగుతున్న సమగ్ర సర్వేలో ఆయన పాల్గొని స్థానిక ప్రజలకు సమగ్ర సర్వే పై విశ్లేషించారు. ఈ సర్వే తో సమగ్ర కుటుంబ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన మొదలైన వివరాలతో పొందుపరచబడిన సమగ్ర సర్వే బుక్ లెట్ పై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పదవ వార్డులో అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. కుటుంబంలోని సభ్యుల వివరాల గురించి అధికారులు అడిగి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ షేక్ మున్ను, మున్సిపల్ కమిషనర్ ఏ రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు కొంతం మంజుల మురళి, వనం శేఖర్, భాగ్యలక్ష్మి శివ, మాజీ వైస్ చైర్మన్ లింగ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.కె బబ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!