రెబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 :  బాల్కొండ మండల కేంద్రంలో రేబిస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్షణ (10)పై నెల కిందట వీధి కుక్క దాడి చేయగా తలలో చిన్న గాయం అయింది. భయంతో చిన్నారి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. మూడు రోజుల కిందట చిన్నారి కుక్కలాంటి అరుపులతో వింతగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలికకు రేబిస్ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

Join WhatsApp

Join Now

Leave a Comment