ఈ – సమాన్స్ నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.

నిజామాబాద్ జై భారత్ జూలై 19: ఈ – సమాన్స్ నిర్వహణపై పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లకు ” ఈ – సమాన్స్ ” శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ” ఈ సందర్భంగా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి కేసులో సంబంధిత వ్యక్తులకు సమయానుగుణంగా ఈ సమా న్స్ జారీ చేయాలన్నారు. పారదర్శకత, వేగవంతమైన సేవలకై టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. సంబంధిత డిజిటల్ ప్లాట్ ఫామ్లను వాడడంలో శిక్షణ తీసుకుని ప్రతి ఆదేశాన్ని రికార్డు చేయాలని సూచించారు. సంబంధిత అన్ని కోర్టుల నుండి సమన్సు జారీ చేసిన వాటిని అట్టి సమాన్స్ లను పోలీస్ స్టేషన్లో వారు డౌన్లోడ్ చేసుకుని ఆ సమాన్స్ ను వాటినిత్వరితగతిన సర్వ్ చేయాలి అని తెలిపారు. ఈ శిక్షణను సిబ్బంది సద్వినియోగపరుచుకొని శిక్షణ పూర్తి అయిన అనంతరము సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ లకు ఈ శిక్షణ గురించి క్లుప్తంగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సతీష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్యాం కుమార్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని కోర్ డ్యూటీ ఆఫీసర్లు, ఐటి కోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!