హైదరాబాద్ జై భారత్ జూలై 19 : సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు రోషిని చావ్లా (28) అనారోగ్యంతో శనివారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రం కు చెందిన రోషిని హైదరాబాద్ లోని అమెజాన్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న రోహిణిని ఆమె తండ్రి, సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉండగానే రోషిణి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.ఆరోగ్యంగా ఉండి అమెజాన్ లో జాబ్ చేసే రోషిని మరణం బాధాకరం, చావ్లా కుటుంబ సభ్యులకు “జై భారత్ తెలుగు పత్రిక” ప్రగడా సానుభూతిని తెలియ చేసింది.
గుండెపోటుతో జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు మృతి
Published On: July 19, 2025 11:54 pm
