నిజామాబాద్ జై భారత్ జూలై 19: తెలంగాణలో బోనాల పండుగకు ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంత ప్రజలు బోనాల ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రజలతోపాటు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో కూడా బోనాల సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శనివారం బీర్కూరు మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు బోనాల పండుగ సంబరాలను ఉత్సాహంతో నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. చిన్నారులు బోనాలను ఎత్తుకొని సమీప ఆలయంలో బోనాలను సమర్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సంబరాల్లో అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.
