నిజామాబాద్ జై భారత్ జూలై 17: నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్ గా పనిచేసిన సయ్యద్ ఇమ్రాన్ నేరేడి గోండ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా మావల పిఎస్ ఎస్ఐ ముజాహిద్ ను నిజామాబాద్ టు టౌన్ కు బదిలీ చేశారు. ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించరు. ఈ సందర్భంగా అసద్ పటేల్ , కాంగ్రెస్ సీనియర్ లీడర్ జియా అహ్మద్, షేక్ అప్సర్, ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో శాలువాతో సత్కరించారు. ఎస్ఐ ముజాహిద్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అసాంఘిక కార్యక్రమా లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మత్తు పదార్థాల పై ఉక్కుపాదం మోపుతామని, బెట్టింగ్ మహమ్మారిని తరిమి వేస్తాను అన్నారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐకి రెండవ టౌన్ పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు.
రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్.
Updated On: July 17, 2025 10:25 pm
