పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్.ఐలు

నిజామాబాద్ జై భారత్ జూలై 8: మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు వరిధిలోని మొదటి సారి పోలీస్ స్టేషన్ ఎస్.ఐలు గా బాధ్యతలు చేపట్టిన   నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ ను పువ్వుల మొక్క ఇచ్చి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భాద్యతాయుతంగా విదులు నిర్వహించాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతీ ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని, వారందరికి తగు న్యాయం చేయాలని, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కచ్చితంగా అమలు చేయాలని, ప్రతీ విషయం తమ పై అధికారులకు తెలియజేయాలని, ప్రతీ గ్రామాలలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధానంగా సైబర్ నేరాల పై, కొత్త చట్టాలపై ,మొదలగునవి ప్రజలకు అవగాహణ కార్యక్రమాలను నిర్వహించాలని తెలియజేశారు. నూతనంగా ఎస్ఐ లుగా బాధ్యతలు చేపట్టిన వారి వివరాలు.ఎమ్. కళ్యాణి – దర్పల్లి పి.యస్,జడ్. సుస్మిత – ముగ్పాల్ పి.యస్,ఎమ్. రమా – ఎడపల్లి పి.యస్, కె. శైలెంధర్ – బాల్కొండ పి.యస్,సుహాసిని – మెండోరా పి.యస్,పి. రాజేశ్వర్ – ఎర్గాట్ల పి.యస్,కిరణ్ పాల్ – 3 టౌన్  పి.యస్ ఎస్.ఐ 2

 

     

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!