నిజామాబాద్ జై భారత్ జూలై 8 : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ యువజన క్రీడల శాఖ స్విమ్మింగ్ పూల్ కోచ్ గా మొహ్మద్ ఫారూఖ్ నియమితులయ్యారు. ఆయన హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియంలో స్విమ్మింగ్ ఈవెంట్లో ఎన్ఐఎస్ శిక్షణ పూర్తి చేశారు. దీని ఆధారంగా జిల్లా పాలనాధికారి స్విమ్మింగ్ కోచ్ గా నియమించారు. జిల్లా యువజన క్రీడల శాఖ స్విమ్మింగ్ పూల్ కోచ్ గా తనను నియమించినందుకు పి సి సి ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు మరియు జిల్లా పాలనాధికారికి, డి వై ఎస్ ఓ పవన్ కు మొహ్మద్ ఫారూఖ్ ధన్యవాదాలు తెలిపారు. ఈత పోటీలు మరియు ప్రత్యేక విభాగంలో నైపుణ్యామ్ కనబరిచి తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేరుస్తానని మొహ్మద్ ఫారూఖ్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ కోచ్ గా మొహ్మద్ ఫరూఖ్ నియామకం
Updated On: July 8, 2025 6:14 pm
