మహిళా పోలీస్ సిబ్బందికి స్కిల్స్ డెవలప్మెంట్

నిజామాబాద్ జై భారత్ జూలై 7: ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమములు , భవిష్యత్తు లో వచ్చే ఎన్నికలను మొదలగునవి దృష్టిలో పెట్టుకొని మహిళా సిబ్బంది తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి నేర్చుకోవడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు తెలుసుకోవలసిన నూతనమైనటువంటి స్కిల్స్ / టెక్నీక్స్ జాగ్రత్తలు మరియు మహిళలకు తమపై తమకు  ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి కావలసిన శిక్షణ గురించి నేర్పించబడును.ప్రతి మహిళా సిబ్బంది తప్పకుండా డ్రైవింగ్ నేర్చుకోవడం స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణముగా అన్ని రకాల మెలకువలను నేర్చుకొని తర్ఫీదు పొందే విధంగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ మహిళల నిరసన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రతి మహిళా సిబ్బంది ఏవిధంగా తమ విధులు నిర్వహించాలో మరియు ఏ విధంగా అట్టి మహిళలను తరలించాలో వీటి గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు / స్కిల్స్ / టెక్నీక్స్ కోసం , ప్రతి ఒక్కరికి ఈ శిక్షణ కాలంలో నేర్పించడం జరుగుతుందని , ఈ శిక్షణను ప్రతి మహిళా సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ శిక్షణ వారం రోజులపాటు ఉంటుందని కొత్త రకాల పద్ధతులను తెలుసుకోవాలని తెలియజేశారు.ఈ శిక్షణను ప్రభుత్వ స్కూళ్లలో పి.ఈ.టిలు / P. D లుగా ఉన్నటువంటి రెజ్లింగ్ , జూడో లలో జాతీయ పతకాలు తీసుకున్నటువంటి టీచర్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (ఏ ఆర్ )  రామ చంద్రరావు , నిజామాబాద్ ఏసిపి  రాజా వెంకట్ రెడ్డి , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు  సతీష్ , శేఖర్ బాబు, ప్రభుత్వ స్కూళ్లకు చెందిన సంతోషి రుద్రూర్ హై స్కూల్, అనిత గుండారం జెడ్పిహెచ్ఎస్ స్కూల్, రజని దేగం జడ్పిహెచ్ఎస్ స్కూల్ తదితరులు పాల్గొనడం జరిగింది.

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!