నిజామాబాద్ జై భారత్ జూలై 3: నిజామాబాద్ పట్టణంలో రోడ్లపై ఏర్పడుతున్న అడ్డంకులు తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.గురువారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ, సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు జవహర్ రోడ్, పుసలగల్లీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా దుకాణదారులు రోడ్లపై ఉంచిన నేమ్ బోర్డులు, రాళ్లు, స్టాండులు, ఇతర వస్తువులను గుర్తించి తొలగించారు. వీటివల్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు.దుకాణదారులు తమ విక్రయ వస్తువులను దుకాణం లోపలే ఉంచుకోవాలని, రోడ్లపై ఉంచి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిజామాబాద్ లో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్.రోడ్ల పై ఉన్న వస్తువులను తొలగించిన ట్రాఫిక్ అధికారులు.
Published On: July 3, 2025 11:02 pm
