నిజామాబాద్ జై భారత్ జూన్ 30 : (షేక్ గౌస్) నిజామాబాద్ RTC డిపోలో సుదీర్ఘకాలం సేవలందించిన ముగ్గురు ఉద్యోగులు — మొహమ్మద్ నసీరుద్దీన్, ఎన్. లక్ష్మణ్ గౌడ్, టీ. నాగేశ్వర్‌లు సోమవారం ఘనంగా పదవీ విరమణ పొందారు. విధులకు ఎల్లప్పుడు నిష్ట, నిజాయితీతో భాద్యతల్ని నిర్వర్తించినందుకు వీరిని డిపో మేనేజర్ ఎస్. ఆనంద్ ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ సందర్భంగా డిపో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సహచరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరికి పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సత్కరించారు. ‘‘RTCకు మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. రిటైరైన తర్వాత మీరు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించండి’’ అని అందరూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
RTC సేవలకు గౌరవం — ముగ్గురు ఉద్యోగులకు ఘన సన్మానం
Published On: June 30, 2025 8:40 pm
