నిజామాబాద్ జై భారత్ జూన్ 26 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ఎస్సై గోవింద్ మరియు సిబ్బంది గురువారం నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ గ్రామ శివారులో గల కోల్డ్ స్టోరేజ్ దగ్గర దారు కుమార్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా అతనిని పట్టుకొని తనిఖీ చేయగా అతని ప్యాంటు జేబులో ఐదు గంజాయి పాకెట్లు దొరికినవి. తరువాత అతను నివసించే గదిలో తనిఖీ చేయగా ఒక సంచిలో 5.25 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోనైనది తదుపరి చర్య నిమిత్తం ఎండు గంజాయిని, నిందితుడిని మరియు ఒక సెల్ ఫోను ని నిజామాబాదు రూరల్ SHO ను అప్పగించనైనది.