నిజామాబాద్ జై భారత్ జూన్ 23: (షేక్ గౌస్) భీమ్ ఆర్మీ నూతన జిల్లా కార్యవర్గానికి మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ), నిజామాబాద్ శాఖ తరపున సోమవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అజయ్, కార్యదర్శి రంజిత్, ఉపాధ్యక్షుడు మెరాజ్, నాయకుడు సాయినాథ్‌లను సాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.MPJ ప్రతినిధులు మాట్లాడుతూ, భీమ్ ఆర్మీ నాయకులు బహుజనుల హక్కుల కోసం, సమాజంలో సమానత్వం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. న్యాయం, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ నూతన నాయకత్వం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు యువత, సంఘ నాయకులు పాల్గొని అభినందనలు తెలియజేశారు.
భీమ్ ఆర్మీ జిల్లా నాయకులకు మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) తరఫున ఘన సన్మానం
Published On: June 24, 2025 11:07 am
