నిజామాబాద్ జై భారత్ జూన్ 23 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ఎస్సై గోవింద్ మరియు పోలీస్ సిబ్బంది సోమవారం నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్ల గుట్ట గ్రామ అటవీ ప్రాంతం లో పేకాట స్థావరం పై దాడి చేసి ఆరుగురు పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినా వారిిిి దగ్గర నుండి 7 సెల్ ఫోన్లు, నగదు 102000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం నిజామాబాదు రూరల్ SHO ను అప్పగించారాని తెలిపారు.