నిజామాబాద్ జై భారత్ జూన్ 23: నిజామాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ గా విచ్చేసిన 2024 బ్యాచ్ ఐ.ఏ.ఎస్ అధికారిణి కరోలిన్ చింగ్తియాన్ మావీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా పాలనాధికారి టి.వినయ్ కృష్ణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. గత ఏప్రిల్ నెలలోనే ట్రైనీ కలెక్టర్ గా నిజామాబాద్ జిల్లాకు కేటాయించబడిన కరోలిన్ చింగ్తియాన్ మావీ, నెలన్నర పాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం జిల్లాకు తిరిగి వచ్చిన సందర్భంగా ఇటీవలే నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు.
జిల్లా పాలనాధికారిని కలిసిన ట్రైనీ కలెక్టర్
Published On: June 23, 2025 5:43 pm
