నగరంలో యువకుడి దారుణ హత్య

నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : నిజామాబాద్​ నగరంలోని బోర్గాం(పి) సమీపంలో యువకుడి దారుణ్య హత్య కలకలం రేపింది. నాలుగో టౌన్​ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గాం(పి) మెగా వాటర్​ ప్లాంట్ వద్ద అర్ధరాత్రి దుండగులు ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హతమార్చారు. యువకుడి ముఖంపై బండరాళ్లతో దాడిచేసిన ఆనవాళ్లు ఉన్నాయి.సమాచారం అందుకున్న నాలుగో టౌన్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్​తో తనిఖీలు చేపట్టారు. కాగా.. హత్యకు గురైన యువకుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. యువకుడి సమాచారం తెలిస్తే నాలుగో టౌన్​లో సంప్రదించాలని ఎస్సై శ్రీకాంత్​ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!