నిజామాబాద్ జై భారత్ జూన్ 10: నగరంలోని వినాయక్ నగర్ లోని ఫూలాంగ్ ప్రాంతంలో చెట్టు కొమ్మ విరిగిపడి విద్యుత్ శాఖ లైన్ మెన్ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. నగరంలోని బోర్గాం( పి )ప్రాంతం సంజీవరెడ్డి నగర్ కు చెందిన శ్రీనివాస్ విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో శ్రీనివాస్ స్థానికంగా ఉన్న ఒక షెడ్డు వద్ద ఆశ్రయం తీసుకోగా.. అక్కడ ఉన్న చెట్టు నుంచి కొమ్మ విరిగిపడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చెట్టుకొమ్మ విరిగి పడి లైన్ మెన్ మృతి-నాలుగో టౌన్ పరిధిలో ఘటన
Published On: June 10, 2025 10:26 pm
