కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ బి కానిస్టేబుల్ మోహన్ సింగ్ సస్పెండ్ చేస్తు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను సదరుకానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్బి కానిస్టేబుల్ గా విధుల్లో నిర్లక్ష్యం వహించడం కాకుండా అవినితికి పాల్పడుతు, పేకాట ఆడిస్తు అనైతికంగా ప్రవర్తించాడని ఎస్పీ పేర్కొన్నారు.పోలీసు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు.పోలీస్ సిబ్బంది ఎవరైనా అనైతిక చర్యలకు పాల్పడితే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లాలో ఎస్ బి కానిస్టేబుల్ సస్పెన్షన్
Updated On: June 4, 2025 11:40 pm
