కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో దళిత రైతు వాణిజ్య పంటలను సాగుచేస్తూ అధిక లాభాలను పొందుతున్నాడు. ఈ విషయమై ఉమ్మడి సదాశివ నగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగల రాజేశ్వరరావు మాజీ ఎంపీపీ అనుముల రాజయ్య బీసీ నాయకులు సాయ గౌడ్ తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించాలని రైతు రాజు కోరారు.ఆయన కోరిక మేరకు బుధవారం ఉదయం వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతు చేస్తున్న కృషిని అభినందించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడ్ని నిజం చేసిన రైతును చూసి నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగా కార్యకర్తగా దీర్ఘకాలిక పంటలను సాగు చేస్తూ లాభాలు రాక నిత్యం అనేక బాధలతో రాజు కాలం వెళ్లదీసేవాడు. అయితే కెసిఆర్ ప్రకటనకు స్ఫూర్తి పొందిన రాజు 90 శాతం సబ్సిడీపై పాలీ హౌస్ పొంది తన పంట చేన్లో నిర్మించుకున్నాడు. ఆనాటి నుండి వాణిజ్య పంటలను సాగు చేయడం ప్రారంభించారు. పాళీ హౌస్ కాకుండా తనకున్న ఎనిమిది ఎకరాల పంట పొలాల్లో ఇతర పంటలను సాగు చేయడం మానేసి వాణిజ్య పంటలైన టమాట సాగుచేసి అధిక లాభాలను పొందుతున్నానని తెలిపాడు.ఆయన వ్యవసాయం చేయడమే కాకుండా తనకు మిత్రులైన పలు గ్రామాల్లోని యువకులను కూడా ప్రోత్సహించి వాణిజ్య పంటలు సాగు చేయాలని ఒక మార్గదర్శక మారడం అభినందనీయమని మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు అన్నారు.ఇప్పుడు మండలంలోని ఏ గ్రామానికి వెళ్లిన టమాటా రాజు అని పేరు తెచ్చుకున్న యువకుడు జోరుగా పంటలు పండిస్తున్నారు. యువకులు వ్యవసాయని నమ్ముకొని వాణిజ పంటలు సాగు చేసి పలువురికి ఉపాధి కల్పించాలని రాజు ఈ సందర్భంగా తెలిపారు. తన వ్యవసాయ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన టిఆర్ఎస్ నాయకులకు చూపించి ఏ విధంగా సాగు చేస్తున్న విధానాన్ని వివరించారు. మండలంలోని యువకులు వ్యవసాయం వైపు దృష్టి పెట్టి రాజును ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు కోరారు. ఏది ఏమైనా కెసిఆర్ స్ఫూర్తితో తెలంగాణలో వ్యవసాయ రంగమే పూర్తిగా మారిపోయింది అని యువకుడైన రైతు రాజు వివరించారు.
కెసిఆర్ ప్రభుత్వ సహకారంతో వాణిజ్య పంటలను సాగు చేస్తున్నాను
Published On: June 4, 2025 9:32 pm
