నిజామాబాద్ జై భారత్ జూన్:4 మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మోపాల్ మండలంలోని ఒక గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 15 సంవత్సరాల బాలికపై 17 సంవత్సరాల బాలుడు మంగళవారం అర్థరాత్రి అత్యాచార యత్నానికి పాల్పడుతుండగా బాలిక కేకలు వేయగా, పక్కనే నిద్రిస్తున్న తల్లి నిద్ర లేవడంతో బాలుడు పారిపోయాడు. వెంటనే మోపాల్ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారని సమాచారం. బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.
మోపాల్ మండలంలో బాలికపై అత్యాచారయత్నం. ఫోక్సో కేసు నమోదు
Published On: June 4, 2025 9:28 pm
