నిర్మల్ జై భారత్ జూన్ :2(నాని భోజన్న) సోమవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని మొదట పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంచి, బహుమతులను అందజేశారు. ఈ వేడుకల్లో జిల్లా రెవెన్యూ కలెక్టర్ కిషోర్ కుమార్, క్యాంపు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
Published On: June 2, 2025 12:55 pm
