నిజామాబాద్ జై భారత్ మే:27 ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 29 నుండి ప్రారంభమవుతుందని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్ట్ల మూల్యాంకనం విధులలో పాల్గొనేందుకుగాను ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్, అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న ఆయా సబ్జెక్ట్ల లెక్చరర్ల ఆర్డర్ కాపీలు కళాశాల లాగిన్ లలో నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని తెలియజేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ మూల్యాంకన విధుల్లో పాల్గొనేందుకు వీలుగా అధ్యాపకులను రిలీవ్ చేయనట్లయితే ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. అధ్యాపకుల ఆర్డర్ కాపీలను ఇంటర్ బోర్డు ఆయా కళాశాల లాగిన్లలో నుండి వెంటనే తమ అపాయింట్మెంట్ ఆర్డర్లను డౌన్లోడ్ చేసుకొని 29న ఉదయం పది గంటలకు నిజామాబాద్ ఖిల్లా బాలుర జూనియర్ కళాశాల వద్ద మూల్యాంకన కేంద్రంలో అధ్యాపకులు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఆయా గురుకుల కళాశాల ల ప్రిన్సిపాల్ లు వెంటనే అధ్యాపకులను రిలీవ్ చేయాలని ఆదేశించారు. నాట్ అపాయింటెడ్ లిస్టులో ఉన్న అధ్యాపకులను కూడా మూల్యాంకనం విధుల్లోకి తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు.
29నుండి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం -డిఐఈఓ తిరుమలపుడి రవికుమార్
Updated On: May 27, 2025 8:45 pm
