నిజామాబాద్ వెల్‌నెస్ సెంటర్‌లో మందుల తీవ్ర కొరత.

నెల రోజులుగా బీపీ మాత్రలు లేవు – రోగులు ఆవేదన

నిజామాబాద్ జై భారత్ మే:27 (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన నిజామాబాద్ వెల్‌నెస్ సెంటర్ ప్రస్తుతం మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పాత మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న ఈ కేంద్రంలో గత నెల రోజులుగా సాధారణ రక్తపోటు (బీపీ) మాత్రలు సహా అనేక ముఖ్యమైన ఔషధాలు అందుబాటులో లేవు.జిల్లాలోని వివిధ మండలాల నుంచి పదవీవిరమణ చేసిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు ఈ కేంద్రానికి వచ్చి వైద్యు పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే, డాక్టర్లు నాలుగు_ ఐదు రకాల మందులు రాస్తున్నప్పటికీ, ఫార్మసీలో మిగతా మందులు లేవని చెప్పి కేవలం ఒకటి లేదా రెండే మందులు అందిస్తున్నారు.“ఒకట్రెండు మాత్రల కోసం ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించి రావాలనా ? అని ఓ వృద్ధురాలు వాపోయారు. పింఛన్‌పై జీవించే ఆమెకు ఈ విధమైన అసౌకర్యం వల్ల ఆవేదన వ్యక్తం చేశారు.వెల్‌నెస్ సెంటర్‌ వైద్యుల మాటల్లో కూడా నిరాశే కనిపిస్తుంది. “మేము మందులు ఆర్డర్ చేశాం, కానీ ఇప్పటివరకు సరఫరా కాలేదు” అంటూ వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి రోజు వందల మంది ఈ సెంటర్ ద్వారా ఈ ఆరోగ్య సేవలు పొందుతున్నారు. చాలా మంచి సేవలు అందించే సెంటర్ గా మంచి పేరుంది అయితే ఇప్పుడు ” బీపీ మాత్రలు లేని పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది” అని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మందుల సరఫరా పునరుద్ధరించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!