నిజామాబాద్ జై భారత్ మే :23 వర్ని చౌరస్తా నుండి ఇంద్రాపూర్ రోడ్డు పరిస్థితి దయనీయంగా ఉందని ప్రజా ప్రతినిధులు ఎందరు మారిన రోడ్డు తలరాత మాత్రం మారడం లేదని ఇంద్రాపూర్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఇంద్ర పూర్ రోడ్డులో చెత్తను తీసుకెళుతున్న వాహనం బోర్లా పడడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిత్యం వందల రకాల వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డు పరిస్థితి దయనీయంగా ఉండడంతో కాలనీవాసులు, వాహన చోదకులు దినదిన గండం గా గడుపుతునామన్నారు. ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నారని అడుగడుగునా గుంతలు ఉండడంతో రోడ్డుపైన వాహనాలు నడపడానికి ప్రాణ భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వాహనాలు నడుపుతున్నామని అన్నారు. ఉదయం చెత్తను తీసుకెళ్లడానికి వచ్చిన మున్సిపల్ చెత్త వాహనం గుంతల మయమైన రోడ్డులో వెళుతూ అదుపుతప్పి బోర్లా పడిందని దీనితో అందులో ఉన్న కార్మికులకు ఎలాంటి అపాయం జరగకపోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.స్కూలు ప్రారంభమైతే రోజుకు 30 నుంచి 40 వాహనాలు తిరుగుతూ ఉంటాయి సెలవులు కావడంతో వాహనములు తిరగడం లేదు ఇక 15 రోజులైతే ఇంద్ర పూర్ కల్లు డిపో రోడ్డు రద్దీగా ఉంటుంది అధికారులకు గత 5 సంవత్సరాల నుంచి అధికారులకు విన్నమించిన పట్టించుకునే లేకపోవడంతో కాలనీవాసులు ఆవేదన వారు వ్యక్తం తెలుపుచున్నారు. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి రోడ్డు మరమ్మత్తులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు.