పోలీస్ శాఖ ఆద్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి వేడుకల నిర్వహణ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22
నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్,  ఆదేశానుసారంగా ఈరోజు  నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్ )  జి. బస్వారెడ్డి  హజరయి భాగ్యరెడ్డి ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి ( అడ్మిన్ )  మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ చిన్నప్పటి నుండి చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతోశ్రద్ద కనబర్చేవారు , సభలు సమావేశాల సందర్భంలో హరికథలను నిర్వహించేవారని , 1911 సం||లో అంటరాని కులాల ఉద్దరణకై మన్యసంఘాన్ని ఏర్పాటుచేశారని , ఈ మన్యసంఘాం అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. దేవదాసి, జోగిని వంటి దురాచారాల నిర్మూలించడం కోసం కృషి చేశారు అని అన్నారు. ప్రతి ఒక్కరూ భాగ్యరెడ్డి వర్మ ఆశయాల సాధనకు కృషి చేయాలని, వారికి అన్ని రకాల సహకారాలు అందించుటకు పోలీస్ శాఖ  నిరంతరం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలియజేశారు.ఈ సందర్భంగా  అదనపు డి.సి.పి ( స్పెషల్ బ్రాంచ్)  శ్రీనివాస్ రావ్  , ఆషియా బేగం (AO),స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్  శ్రీశైలం, ఆఫీస్ సూపరింటెండెంటులు  శంకర్ ,  బషీర్, వనజ రాణీ , రిజర్వు ఇన్స్పెక్టర్స్  తిరుపతి (వెల్ఫేర్), ఐ.టి కోర్ సిబ్బంది, సి.సి.ఆర్.బి సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది. హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!