నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18
అధిక వడ్డీ వసూలు చేస్తున్నకానిస్టేబుల్ పై నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆరిఫ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..నిజామాబాద్ నగరంలోని ప్రియదర్శిని కాలనీకి చెందిన కల్వరే గంగాధర్ కానిస్టేబుల్ మెండోరా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కల్వరే గంగాధర్ గత కొన్ని సంవత్సరాలుగా అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వారి నుంచి సేల్ డీడ్ కింద భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు. నగరానికి చెందిన ఒక మహిళకు సేల్ డిడ్ పేరుతో మూడు స్థలాలను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని రూ.8లక్షలు అప్పుగా ఇచ్చాడు. బాధిత మహిళ గంగాధర్ పై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆరిఫ్ తెలిపారు.