పూర్వ విద్యార్థుల సమ్మేళనం – స్నేహబంధానికి ప్రతీక

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 27

స్నేహానికి అవధులు లేవని దూరప్రాంతాల నుండి చేరుకున్న మిత్రులు.

గుర్తులు మిగుల్చుకున్న అందమైన మనసులు ఎన్నో.

స్నేహబంధాన్ని మరింత బలంగా, మరిచిపోని గుర్తులను చిరస్థాయిగా నిలుపుకోవడానికి నిజామాబాద్ లోని శుభాష్ నగర్ లో గల వాసు హై స్కూల్ 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అదే బ్యాచ్ కి చెందిన వి. నరేందర్ అధ్యక్షతనా ఘనంగా జరిగింది. వంశీ ఇంటర్నేషనల్ హోటల్ లో ఆదివారం జరిగిన ఈ వేడుక అందరికీ చిరస్మరణీయంగా నిలిచింది.

ఘనంగా ప్రారంభమైన వేడుక

కార్యక్రమానికి కరస్పాండెంట్ వాసు, సైన్స్ ఉపాధ్యాయుడు రాజేంద్ర ప్రసాద్, జీవ శాస్త్ర ఉపాధ్యాయులు అశోక్ కుమార్, గణితం మాష్టారు రుక్మారెడ్డి, ఆంగ్ల ఉపాధ్యాయులు మహేందర్, పీ.ఈ.టి. లక్ష్మణ్ రావ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి పూలతో స్వాగతం పలికారు.

అభినందన కార్యక్రమం

సమావేశంలో విద్యార్థులు తమ పాఠశాల రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఉపాధ్యాయులను ఘనంగా పుషగుచ్చాలతో స్వాగతం పలికి, సన్మానించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. విద్యార్థులకు నాటి గురువులు మళ్లీ కలవడం ఆనందాన్ని నింపింది. అనంతరం కరస్పాండెంట్ మాట్లాడుతూ.. మా పాఠశాలలో విద్యబుద్ధులు నేర్చుకున్న మా విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో విధమైన ఉన్నత స్థానాలను అధిరోహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

సరదా సమయం

విందు అనంతరం విద్యార్థులు తమ బాల్యస్మృతులను పంచుకుంటూ కలసి నవ్వుకున్నారు. మ్యూజికల్ చైర్, పలు సినిమా, జానపద పాటలపై నృత్య కార్యక్రమాలు నిర్వహించి హాయిగా గడిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులచే కట్టెతో తిన్న దెబ్బలను సరదాగా గుర్తుచేసుకున్నారు.

స్నేహాన్ని గుర్తుగా మిగిల్చిన ఫోటోలు

కార్యక్రమంలో గ్రూప్ ఫోటోలు తీసుకుని వాటిని గుర్తుగా భద్రపర్చుకున్నారు. విద్యార్థుల మధ్య అనుబంధాన్ని పునరుద్ధరించే ఒక అద్భుతమైన సందర్భంగా ఈ సమ్మేళనం నిలిచింది.ఈ సమ్మేళనం ప్రతి ఒక్కరికీ స్నేహాన్ని, గురువుల విలువను గుర్తు చేసే గొప్ప సందర్భంగా మారింది. “స్నేహం కాలానికి అతీతం” అనే మాటకు నిజమైన అర్థాన్ని ఇస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!