నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24
నిజామాబాద్ లో 7 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్స్ పొందిన వారిని అభినందించిన పోలీస్ కమీషనర్
తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశానుసారంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిదిలోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబులుగా 7 మంది ప్రమోషన్ పొంది నేడు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్, ను పువ్యులమొక్క ఇచ్చి మర్యాదపూర్వకంగా కలువడం జరిగింది.గత కొంత కాలంగా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్న కానిస్టేబుల్స్ కు హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన హెడ్ కానిస్టేబుల్స్ లకు పోలీస్ కమీషనర్ పి సాయి చైతన్య శుభాకాంక్షలు తెలియజేశారు.