నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24
అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచిన ఓ వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాలపల్లిలో అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచిన మక్సూద్ ఖాన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. విచారించిన సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ అతడికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్హెచ్వో తెలిపారు