అహల్య భాయ్ జయంతి వేడుకల్లో హాట్ కామెంట్ చేసిన – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-24

ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టి పి యు ఎస్ ) నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అహల్య భాయ్ హోల్కర్ త్రి శతబ్ది జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్సి మల్కా కొమురయ్య పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఈ దేశానికి ఎమర్జెన్సీ చీకటి పాలన విధించి, నిర్భందించిన ఇందిరాగాంధీ చరిత్ర కాకుండా అహల్య భాయ్, ఝాన్సీ లక్ష్మిభాయ్, రాణి రుద్రమ్మ, జిజియా భాయ్ లాంటి వీర వనితల చరిత్రను మహిళా సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.భారతదేశంలోని మరాఠా మాల్వా రాజ్యానికి రాజమతగా హిందూ దేవాలయాల పునః నిర్మాణానికి, ఆధ్యాత్మిక సేవ రంగాలలో, మహిళలను చైతన్యం చేయడంలో అహల్య దేవి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. వందలాది దేవాలయాలు మరియు ధర్మశాలలను నిర్మించి 1780లో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ, మరమ్మత్తుకు అత్యంత కృషి చేసారన్నారు.అహల్య దేవి న్యాయ బద్ధమైన పాలన నిర్వహించడంలో ఖ్యాతిని సంపాదించింది అన్నారు. తన ఏకైక కుమారుడిని మరణశిక్ష విధించడమే ఆమె న్యాయ పాలనకు నిదర్శనం అన్నారు.అహల్య దేవి పాలనలో పిల్లలు లేని వితంతువుల ఆస్తిని జప్తు చేసే సాంప్రదాయ చట్టాన్ని తొలగించడం, మహిళా రక్షణ దళలు ఏర్పాటు సహా కొన్ని మైలురాయి నిర్ణయాలు కూడా తీసుకుందన్నారు.నేడు సమాజంలో హిందువుల పైన హిందూ దేవాలయాల పైన జరుగుతున్నా దాడులను హిందువులు అంత సంఘాటీతం అయ్యి ప్రతిఘటించాలన్నారు.కాశ్మీర్ పహాల్ గామ్ లో ఉగ్రవాదులు చేసిన మరణ కాండ ఆయనను కల్చివేసిందాన్నారు తప్పకుండ దీనికి సమాధానం చెప్పి తీరుతాము అని పాకిస్తాన్ ఉగ్రవాధులను హెచ్చరించారు. బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు హనుమంతరావు, ప్రధానకార్యదర్శి సురేష్, జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, డి.ఇ.ఓ అశోక్, ముఖ్య వక్త కల్పన, ఏబీవీపీ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేష్,రాజ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!