ఇంటర్ ఫలితాల్లో ఎస్సార్ కాలేజీ విద్యార్థుల ప్రభంజనం-రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఎంపీసీ విద్యార్థిని  

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :22
 ఇంటర్ ఫలితాలలో నిజామాబాద్ లోని ఎస్సార్ కాలేజ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అత్యధిక మార్కులతో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించిన కళాశాల యజమాన్యం మంగళవారం ఎస్సార్ కాలేజ్ లో ఏర్పాటుచేసిన అభినందన సభలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను అభినందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు 1000 మార్కులకు గాను 993, 991 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచారు. 990 మార్కులతో ఇద్దరు విద్యార్థులు, బైపీసీ విభాగంలో 993 మార్కులతో ఒకరు,992 మార్కులతో ఒకరు, 990 మార్కులతో ఇద్దరు, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభా కనబరిచారు. 980 ఆపై మార్కులతో 127 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 468 మార్కులతో నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ప్రతిమ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల డీజీఎం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత 11 సంవత్సరాల కాలం క్రితం ప్రారంభించిన నాటినుండి నేటి వరకు జిల్లా రాష్ట్ర స్థాయి మార్కులతో ఎస్సార్ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని ఈ విజయనికి పటిష్టమైన ఎస్సార్ కాలేజ్ మెటీరియల్, షెడ్యూల్, ఎగ్జామినేల్ సిస్టం, అనువాగ్నులైన అధ్యాపకులు, క్రమశిక్షణ కలిగిన అడ్మినిస్ట్రేటివ్, ఉన్నారన్నారు. రాబోయే రోజులలో నీట్ పరీక్షల్లో కూడా ఎంబిబిఎస్ సీట్లు సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, శ్రీధర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి,, దేవేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, మురళి, నరసింహారెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!