నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:22 ( షేక్ గౌస్)
కోటగల్లిలోని శంకర్ భవన్ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, పాఠశాల అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.పీఎం శ్రీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 27 లక్షల నిధులు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌కు మరో 10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పాఠశాలను జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, యోగ మరియు కళలలోనూ ప్రతిభ కనబర్చాలని సూచించారు. ప్రతిభావంతులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్, ఎంఈఓ సాయిరెడ్డి, హెడ్ మాస్టర్ రాంచందర్, కమిటీ ఛైర్పర్సన్ గోదావరి, బీజేపీ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.