వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం: షబ్బీర్ అలీ.

నిజామాబాద్ ప్రతినిధి జై భరత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20

వక్ఫ్ బోర్డు చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లింలు.

నిజామాబాద్‌ లో వేలాది ముస్లింలతో వక్ఫ్ బచావో ర్యాలీ.
వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం. ఇది ముస్లిం మైనారిటీల హక్కులపై కేంద్రం చేస్తున్న కుట్ర. వక్ఫ్ ఆస్తుల్ని ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేయడం చట్ట విరుద్ధం. మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. చట్టబద్ధంగా ఈ బిల్లును నిలిపివేయిస్తాం,” అన్నారు.వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆదివారం నాడు నిజామాబాద్ పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు జరిగిన ఈ వక్ఫ్ బచావో ర్యాలీ శైలజా గ్రౌండ్ నుండి ఖిల్లా రోడ్ దాకా సాగింది. వేలాదిమంది ముస్లింలు పాల్గొనగా, విభిన్న మతపరమైన సంఘాలు, యువత, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ర్యాలీలో పాల్గొన్నవారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలంటూ పలువురు నేతలు మాట్లాడారు.

వక్ఫ్ బిల్‌పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం.

వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం నాడు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది. కేసులో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపిస్తున్నారు.వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యత కలెక్టర్లకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని ముస్లిం లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను చేర్చే ప్రక్రియ – మత స్వాతంత్ర్యానికి భంగం.రాజ్యాంగ ఆర్టికల్స్ 25, 26లకు వ్యతిరేకంగా నూతన బిల్లు ఉందని పలువురు విమర్శించారు.ముస్లింల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టులో పోరాటం సాగిస్తాం. న్యాయం సాధిస్తాం,” అని ప్రభుత్వ సలహా దారుడు స్పష్టం చేశారు.నిజామాబాద్ వక్ఫ్ బచావో ర్యాలీ, రాష్ట్రవ్యాప్తంగా చైతన్యం నింపింది. ఇతర జిల్లాల్లోనూ, మండల స్థాయిలో ఇదే తరహా ర్యాలీలు నిర్వహించడానికి ముస్లిం సంఘాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!