నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS., ఆదేశాల మేరకు నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీసులు అక్రమ వడ్డీ వ్యాపారులపై గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.ఎలాంటి అనుమతులు లేకుండా , రిజిస్ట్రేషన్ సైతం లేకుండా అనేకమంది అక్రమంగా ఫైనాన్స్ లు ఏర్పడి, ఇలా అక్రమ వడ్డీ దండ నిర్వహిస్తున్నారని ఫిర్యాదుల మేరకు ఈ దాడులు జరిపారు. సామాన్య పేద కుటుంబాలకు చెందిన వారి అవసరాలను ఆసరాగా చేసుకొని ఫైనాన్స్ పేరుతో వారి వద్ద నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వీరిని ఆర్థికంగా మరింత ఇబ్బందులకు గురిచేస్తున, ఈ అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS., హెచ్చరించారు.