నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:11
నిజామాబాద్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిదిలోని ఈ నెల 12న నిర్వహించే హనుమాన్ జయంతి, శోభాయాత్ర అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్, తెలియజేశారు.
ఇందుకోసం నిజామాబాద్ ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి , ములుగు , మహబూబాబాద్ జిల్లాల నుండి పోలీస్ సిబ్బంది మరియు TSSP బెటాలియన్ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వాహణ కోసం దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.నిజామాబాద్ డివిజన్ పరిధిలలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శోభాయాత్ర ప్రారంభం నుండి చివరి వరకు దారి పోడువున ” సి.సి కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఏర్పాట్లు, బైనాక్యూలేర్లతో పర్యవేక్షణ, పాత నేరస్థులపై నిఘా పటిష్ట పర్చడం జరిగింది. అన్ని చోట్ల పటిష్టమైన నిఘా వ్వవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ప్రతీ ఓక్కరు అన్ని రకాల జాగ్రత్తలు వహించాలని, శోభాయాత్ర సందర్భంగా అవసరమైనజాగ్రత్తలు వహించాలని , శోభాయాత్ర ప్రారంభం నుండి ప్రశాంతంగా సాగేందుకు యాత్ర నిర్వాహాకులు, భక్తులు యాత్రలో పాల్గొనే ప్రజలు నిబంధనల ప్రకారం నడుచుకుంటు పోలీసులకు సహాకరించాలని, శోభాయాత్రను అందరు శాంతి యుతంగానే జరుపుకోవడం అందరికి శ్రేయస్సుకరమని, ఎలాంటి రూమర్లును నమ్మవద్దని, ప్రతిఒక్కరు స్నేహభావంగా ఉండాలని తెలియజేశారు.తేది.12-04-2025 నాడు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ దిగవ తెలియజేసిన రోడ్డు మార్గంలో తమరి వాహనాలు వెళ్ళవలెను. ఈ దిగవ చూపబడిన ప్రకారం వాహనాల
ట్రాఫిక్ డైవర్షన్ హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ వెల్లు బస్సులు
RTC బస్ స్టాండ్, ZP “T” రోడ్, నిర్మల హృదయ స్కూల్ ముందు నుండి అంబెడ్కర్ కాలనీ, దుబ్బ రోడ్, గిరిరాజ్ కాలనీ నుండి బైపాస్ రోడ్డు చేరుకోవాలి.బోధన్ నుండి వచ్చి పోయే వాహనాలు:-* అర్సపల్లి రైల్వే గేట్ నుండి కొత్త కలక్టరేట్, కాంటేశ్వర్ బై పాస్, కాంటేశ్వర్ టెంపుల్ “T” జంక్షన్, NTR చౌరాస్తా, RTC బస్ స్టాండ్ చేరుకోవాలి.
బాన్స్ వాడ నుండి వచ్చి పోయే వాహనాలు
వర్ని చౌరాస్తా నుండి పులాంగ్ సర్కిల్, కోర్ట్ సర్కిల్, NTR చౌరస్తా, రైల్వే స్టేషన్ RTC బస్సు స్టాండ్ చేరుకోవాలి.నిజామాబాద్ డివిజన్ మొత్తం సిబ్బంది పోలీస్ కమీషనర్, అదనపు పోలీస్ కమీషనర్లు , ఎ.సి.పిలు, సి.ఐ లు, ఎస్.ఐ లు. ఎ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుల్స్ , కానిస్టేబుల్స్ , మహిళా కానిస్టేబుల్స్ , స్పెషల్ పార్టీలు ఇతర సిబ్బంది దాదాపు 1300 మంది బందోబస్తులో విధులు నిర్వహించడం జరుగుతుంది.